కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన గంభీర్

కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అసోంలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. కాగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోయింది. రెండో మ్యాచ్ ఈనెల 22 నుంచి గౌహతిలో జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు గంభీర్ కామాఖ్య ఆలయ సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది.