మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

మహాశివరాత్రి ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

VZM: మహాశివరాత్రి సందర్భంగా పుణ్యగిరి దేవస్థానంలో జరుగుతున్న ఏర్పాట్లను డీఎస్పీ ఆర్.గోవిందరావు, ఎస్.కోట పట్టణ సీఐ నారాయణమూర్తి, దేవస్థానం అధికారులతో మంగళవారం పరిశీలించారు. ముందుగా ఆలయం చుట్టూ తిరిగి పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అలాగే క్యూ లైన్ల వద్ద బారికేడ్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.