బయట ఆహారం తీసుకోవద్దు: జిల్లా కలెక్టర్
KMM: ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో బయట ఆహారం తీసుకోవద్దని, బయట ఎక్కువ తిరగవద్దని, మంచినీరు తగినంత త్రాగాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అటు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ, గొప్ప స్థాయికి చేరుకోవాలని చెప్పారు. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు.