బాపట్లలో అటవీ అమరవీరులకు నివాళి

బాపట్లలో అటవీ అమరవీరులకు నివాళి

BPT: బాపట్లలో జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాపట్ల మండలం నగరవనంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ కమిషనర్ కాంతి లాల్ దండే, జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి, ఎస్పీ తుషార్ డూడి పాల్గొన్నారు. దేశానికి, అటవీ సంపదకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల సేవలను వారు కొనియాడారు.