బ్యాంక్‌లో నకిలీ గోల్డ్ తాకట్టు.. నలుగురు అరెస్ట్

బ్యాంక్‌లో నకిలీ గోల్డ్ తాకట్టు.. నలుగురు అరెస్ట్

SS: ఓబులదేవరచెరువు SBI బ్యాంక్‌లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి అధిక రుణం తీసుకున్న నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై మల్లికార్జునరెడ్డి తెలిపారు. నిందితులు డబురువారిపల్లికి చెందిన జయప్ప, ముస్తాక్ బాషా, రఘుకుమార్, నగేష్‌గా గుర్తించారు. వీరు రైతుల పేర్లతో నకిలీ బంగారాన్ని తేచ్చి బ్యాంక్‌లో మోసానికి పాల్పడ్డారు. రెండోసారి బ్యాంకుకు రాగా ఈ మోసం వెలుగులోకి వచ్చింది.