అన్నదాతలకు అండగా కూటమి ప్రభుత్వం: ఎమ్మెల్యే
కోనసీమ: కొత్తపేట మండలం బిళ్ళకుర్రు శివారు కముజువారిపాలెంలో మంగళవారం జరిగిన 'రైతన్న మీ కోసం' కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి పథకం కరపత్రాలను అందజేశారు. ప్రభుత్వం అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సాయం గురించి స్థానికులకు వివరించారు. ఆయన మాట్లాడుతూ.. అన్నదాతలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.