సీఎం సహాయ నిధి చెక్కు అందజేత
VZM: కొత్తవలస మండలం రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన కొప్పల సత్యవతికి ముఖ్యమంత్రి సహాయ నుండి రూ 20,000 చెక్కును జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు లెంక శ్రీను ఇవాళ ఆయన స్వగృహంలో ఆమెకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మధ్యతరగతి కుటుంబాలు కార్పొరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకోలేని వారికి సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.