12 వార్డుల తుది ఓటరు ఫొటో జాబితా విడుదల

12 వార్డుల తుది ఓటరు ఫొటో జాబితా విడుదల

WGL: రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ మేరకు వర్ధన్నపేట పట్టణంలోని 12 వార్డులకు సంబంధించిన తుది ఓటరు ఫొటో జాబితాను సిద్ధం చేసి ప్రచురించినట్లు మున్సిపల్ కమిషనర్ సుధీర్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ జాబితాను వరంగల్ ఆర్డీవో కార్యాలయం, వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం, వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయ నోటిస్ బోర్డులపై అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.