సంతల ఆదాయం రూ.4.22 లక్షలు

సంతల ఆదాయం రూ.4.22 లక్షలు

అనంతపురంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు వారం సంతల్లో ఆదాయం పుంజుకుంది. గత వారం సంతల్లో దసరా పండుగతో ఆదాయం తగ్గింది. ఈ వారం మళ్లీ పెరిగింది. గత వారం మొత్తం రూ.3,45,200ల ఆదాయం వచ్చింది. ఈ వారం మొత్తం రూ.4,22,740కు పెరిగింది. అందులో గొర్రెలు, మేకల సంతలో రూ.2,23,550 ఆదాయం రాగా, పశువుల సంతలో రూ.1,99,190 ఆదాయం వచ్చిందని యార్డు ఎంపికశ్రేణి కార్యదర్శి గోవిందు ఒక ప్రకటనలో తెలిపారు.