వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం
VSP: వైజాగ్ ఉక్కు కర్మాగారంలో బ్యాటరీ-3లో ఆదివారం మంటలు చెలరేగాయి. 305వ ఓవెన్‌కు ఛార్జింగ్ పూర్తయ్యాక టెలిస్కోప్ లిఫ్ట్ కాకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఓవెన్ నుంచి వచ్చిన మంటలు ఛార్జింగ్ కారు-7, దాని అనుబంధ ఎంసీసీ (MCC)ని పూర్తిగా దహనం చేశాయి. అప్రమత్తమైన సిబ్బంది వేంటనే కారును పక్కకు తప్పించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.