'సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి'

CTR: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల 23న తిరుపతిలోని మున్సిపల్ మైదానంలో జరిగే రాయలసీమ మాలల సింహగర్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాల జేఏసీ నాయకులు బుధవారం పిలుపునిచ్చారు. సింహగర్జన కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికలను వారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని పెద్ద సంఖ్యలో మాలలందరూ తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.