ISRO-ఎయిమ్స్ మధ్య మెగా డీల్
ISRO, ఢిల్లీ ఎయిమ్స్ మధ్య 'అంతరిక్ష వైద్యం' (Space Medicine)పై చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. భారతీయ అంతరిక్ష స్టేషన్, చంద్రుడిపైకి వెళ్లే మానవ సహిత మిషన్లలో వ్యోమగాముల ఆరోగ్యం, భద్రతను పర్యవేక్షించడం ఈ పరిశోధన ప్రధాన లక్ష్యం. మైక్రోగ్రావిటీలో మానవ శరీర ఫిజియాలజీ, పోషణ, నాడీ వ్యవస్థ వంటి అంశాలపై ఉమ్మడిగా అధ్యయనం చేయనున్నారు. ఇది భారత అంతరిక్ష యాత్రలకు కొత్త ఊపునిస్తుంది.