VIDEO: బాన్సువాడ మండలంలో కోతుల బెడద

VIDEO: బాన్సువాడ మండలంలో కోతుల బెడద

KMR: బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం కోతుల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని కొల్లూరు, బాన్సువాడ, గట్టు శివారు గ్రామాల్లో కోతులతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ప్రధాన రహదారుల వెంట సైతం కోతులు ఉండడంతో రాకపోకలకు వాహనదారులు జంకుతున్నారు. అధికారులు సమస్య నివారణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.