ఈర్ల చెరువును పరిశీలించిన ఎమ్ఆర్‌వో

WNP: భారీ వర్షాల కారణంగా పెద్దమందడి మండలంలోని ఈర్ల చెరువులోకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో చెరువుల కింద లోతట్టు ప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెద్దమందడి ఎమ్ఆర్‌వో సరస్వతి తెలిపారు. చెరువు అలుగు పారడం వల్ల రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయని స్థానికులు ఎమ్ఆర్‌వో దృష్టికి తీసుకువచ్చారు. ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.