ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ మంత్రి

కృష్ణా: గుడివాడ మండలం మల్లాయిపాలెంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి కొడాలి నాని నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తారని, క్రమశిక్షణ దాతృత్వానికి, మత సామరస్యానికి పవిత్ర రంజాన్ మాసం ప్రతీకా అని అన్నారు. అనంతరం ముస్లిం సోదరులకు ఆయన రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.