మావోయిస్టు ఎల్‌వోఎస్ డిప్యూటీ కమాండర్ అరెస్ట్

మావోయిస్టు ఎల్‌వోఎస్ డిప్యూటీ కమాండర్ అరెస్ట్

భద్రాద్రి: దుమ్మగూడెం మండల పోలీసులు మావోయిస్టు పార్టీ కిష్టారం ఎల్‌వోఎస్ డిప్యూటీ కమాండర్ పుట్టం మున్నా, మరో మావోయిస్టు కొరియర్ జాడి పెద్దబ్బాయిలను అరెస్టు చేశారు. అరెస్టు వివరాలను భద్రాద్రి కొత్తగూడెం ఎస్‌పీ మీడియాకు తెలిపారు. ములకనపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా తారసబడిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.