'పార్కుల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు వినియోగించాలి'
VSP: గాజువాక పారిశ్రామిక ప్రాంతంలోని పరిశ్రమలు సీఎస్‌ఆర్ నిధులతో చెరువులు, పార్కుల అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారని ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మొల్లి పెంటిరాజు తెలిపారు. ఆదివారం జీవీఎంసీ 69, 79 వార్డుల పరిధిలోని తుంగ్లం పెద్ద చెరువు, చాలేటి చెరువు, పాత అగనంపూడి చెరువులను పరిశీలించారు.