స్కేటింగ్ పోటీల్లో నర్సీపట్నం క్రీడాకారిణి ప్రతిభ
AKP: విశాఖలోని శివాజీపాలెం స్కేటింగ్ రింక్ వద్ద 37వ రాష్ట్ర స్థాయి ఆర్టిస్టిక్ స్కేటింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో నర్సీపట్నంకు చెందిన క్రీడాకారిణి పీ.చైత్రదీపిక పాల్గొని అద్భుత ప్రతిభ కనపరిచారు. 15-18 ఏళ్ల గ్రూప్ ఈవెంట్స్ (పెయిర్, కపుల్, షో గ్రూప్) విభాగాల్లో మూడు పతకాలను సాధించి జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించారు.