ట్రాక్టర్ చోరీపై కేసు నమోదు: SI
NZB: నవీపేట్ మండలంలోని ఓ పెట్రోల్ బంక్‌లో పార్క్ చేసిన ట్రాక్టర్ చోరీకి గురైందని ఎస్సై తిరుపతి తెలిపారు. నీల గ్రామానికి చెందిన అఫ్రోజ్ ఖాన్ బ్లేడ్ టాక్టర్‌ని అక్టోబర్ 18న పెట్రోల్ బంక్ దగ్గర నిలిపి ఉంచి తర్వాత అక్టోబర్ 22న సాయంత్రం వచ్చి చూడగా కనిపించలేదన్నారు. ఎంత వెతికినా కనిపించక పోయేసరికి మంగళవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడన్నారు.