ఎమ్మెల్యే టికెట్ కోసం రూ. 7 కోట్లు ఇచ్చానని ఆరోపణ
అన్నమయ్య: కోడూరు MLA టికెట్ కోసం టీడీపీ నేత వేమన సతీష్ రూ. 7 కోట్లు తీసుకున్నారని సుధా మాధవి అనే మహిళ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ఆస్తులు, ఇల్లు అమ్మి, అప్పులు చేసి డబ్బులు ఇచ్చానని, ఇప్పుడు డబ్బులు తిరిగి అడిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో తాను నిరాహార దీక్షలు చేపట్టినట్లు, పార్టీ కోసం ప్రచారం చేసినట్లు ఆమె తెలిపారు.