VIDEO: ప్రశాంతంగా జరిగిన పది పరీక్షలు

VIDEO: ప్రశాంతంగా జరిగిన పది పరీక్షలు

SGR: జిల్లా వ్యాప్తంగా 123 కేంద్రాల్లో శనివారం జరిగిన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 24,594 మంది విద్యార్థులకు గాను 24,553 మంది (99.83%) హజరయ్యారు. అలాగే 41 మంది గైర్హాజరు అయ్యారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాశారన్నారు.