VIDEO: 'సంబరాలను విజయవంతం చేయాలి'
AKP: నర్సీపట్నంలో మరిడమ్మ పండగ ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని సంబరాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బాణసంచా పేలుళ్లను అందరూ తిలకించి సంతోషించాలని కోరారు.