అక్రమ టేకు మొద్దులు సీజ్

అక్రమ టేకు మొద్దులు సీజ్

BDK: పినపాక మండలం భూపతిరావుపేట సమీపంలోని గోదావరి తీరంలో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా నిల్వ ఉంచిన ఆరు టేకు మొద్దులను సీజ్ చేశారు. ఏడూళ్లబయ్యారం రేంజర్ తేజస్విని ఆధ్వర్యంలో డిప్యూటీ రేంజర్ వెంకటేశ్వర్లు, బీట్ ఆఫీసర్ శ్యామ్ ఈ చర్యలు చేపట్టారు. అటవీ సంపదను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.