ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి
TG: పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని రాజేష్ థియేటర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అతివేగంగా వచ్చి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టడంతో.. కారు ముందు భాగం నుజ్జునుజ్జుయింది. కారులో నలుగురు వ్యక్తులు ఇరుక్కున్నారు. ఈ ప్రమాదంలో శ్రీధర్ అనే సింగరేణి ఉద్యోగి మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.