ప్రముఖ గాయని ఆశాభోంశ్లే మృతిపై మంత్రి అచ్చెన్న సంతాపం
SKLM: ప్రముఖ గాయని ఆశాభోంశ్లే మృతికి మంత్రి కింజరాపు అచ్చెన్నా ఆదివారం సంతాపాన్ని ప్రకటించారు. ఆమె మధుర గానంతో కోట్లాదిమంది సంగీత అభిమానులకు ఆనందాన్ని కల్పించే గొంతు నేడుమూగబోయిందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి అన్నారు. గొంతు మూగపోవడంతో సంగీత అభిమానుల హృదయాల్లో తప్తశోకం నెలకొందన్నారు.