రాంపల్లి గ్రామంలో విషాదం... విద్యార్థి మృతి

NDL: తుగ్గలి మండలంలోని రాంపల్లి గ్రామంలో శనివారం విషాద సంఘటన చోటు చేసుకుంది. బుచ్చి రమేష్ (13) అనే విద్యార్థి పశువుల మేత కోసం వరిగడ్డి వామిని తవ్వుతుండగా అతనిపై గడ్డివామి పడి ఊపిరి ఆడక మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుని కుటుంబ సభ్యులు బోరుమని విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.