మావోయిస్టు అగ్రనేత లొంగుబాటు
మావోయిస్టు అగ్రనేత పాపారావు అలియాస్ సున్నం చంద్రయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. 17 మంది అనుచరులతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోయారు. వారి వద్ద నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ ప్రాంతానికి చెందిన పాపారావుపై రూ.2 కోట్ల రివార్డు ఉంది. ఆయనపై 50కిపైగా కేసులు ఉన్నాయి.