అప్పలరాజుపురంలో పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక

AKP: చీడికాడ మండలం అప్పలరాజుపురం జడ్పీ హైస్కూల్ ఆదివారం 1984-85వ సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థులు అపూర్వంగా కలుసుకున్నారు. చిన్న నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 40 సంవత్సరాల తర్వాత తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు తెలిపారు.