ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి
KMR: జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వరుని జయంతిని ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ బసవేశ్వరుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 12వ శతాబ్దపు గొప్ప సంఘ సంస్కర్త, తత్వవేత్త అయిన బసవేశ్వరుడు సమాజంలోని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని కొనియాడారు.