ఎమ్మిగనూరు ఎమ్మెల్యేతో భేటి

KRNL: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని పట్టణానికి చెందిన మహిళా నాయకురాలు విజయలక్ష్మి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె వార్డులోని సమస్యలను, రాజకీయ పరిస్థితులను ఎమ్మెల్యేకు వివరించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ ఆధ్వర్యంలో ఎమ్మిగనూరు అభివృద్ధికి నోచుకుంటుందని ఆయన తెలిపారు.