పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: ఎస్పీ

GDWL: జవహర్ నవోదయ పరీక్ష కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ శ్రీనివాసరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 13 న ఉదయం 8:00 నుంచి సాయంత్రం 4:00 గంటల వరకు పరీక్షా కేంద్రాల పరిధిలో సెక్షన్ 163ను అమలు చేస్తున్నామని తెలిపారు. అలంపూర్ మాంటిసోరి హైస్కూల్, గద్వాల ప్రాక్టీసింగ్ హై స్కూల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.