పిల్లలకు ఉపాధ్యాయుల కొరత

కృష్ణా: జిల్లాలో ఐఈఆర్టీ ఉపాధ్యాయుల కొరతతో ప్రత్యేక అవసరాలున్న పిల్లల విద్యా సేవలు అంతరించిపోతున్నాయి. 25 మండలాల్లో 50 పోస్టులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 45 మందే విధులు నిర్వర్తిస్తున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, కృత్తివెన్ను మండలాల్లో ఒక్కో ఉపాధ్యాయుడే ఉండటంతో సేవలు ప్రభావితమవుతున్నాయని.. తల్లిదండ్రులు రెండో పోస్టు భర్తీ చేయాలంటున్నారు.