VIDEO: పెన్షన్ నగదును అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: పెన్షన్ నగదును అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గుడివాడ 36వ వార్డులో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము లబ్ధిదారులకు పెన్షన్ నగదును బుధవారం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ప్రణాళికల ప్రకారం నూతన పెన్షన్ల మంజూరుకు నిరంతర ప్రక్రియ అమలు చేసి వితంతువు పెన్షన్ల ప్రక్రియను సులభతరం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.