పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

MNCL: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాలలోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థల సభ్యులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.