VIDEO: 'జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి'

SRPT: తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. బుధవారం తుంగతుర్తిలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎనలేని కృషి చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు.