శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు సౌమ్యవాసరే పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాసన్పల్లి శివారులో వెలిసిన శ్రీ ఏడుపాయల దివ్య క్షేత్రంలో సోమవారం వన దుర్గమ్మకు సౌమ్య వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖమాసం శుక్లపక్షం తదియ తిథిని పురస్కరించుకొని పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.