ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన
KDP: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సిద్ధవటం మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలో ఉన్న APSP11వ పోలీస్ బెటాలియన్లో కమాండెడ్ కే.ఆనంద రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు శాంతి భద్రత పరిరక్షణ, నేర దర్యాప్తులో ఉపయోగించే ఆయుధాలు సాంకేతిక పరికరాలపై అవగాహన కల్పించారు.