కానిస్టేబుల్స్‌ను అభినందించిన సీపీ

కానిస్టేబుల్స్‌ను అభినందించిన సీపీ

హనుమకొండ: జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయంలో నేడు అత్యధిక సార్లు రక్తదానం చేసిన కానిస్టేబుల్లను సీపీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. రెడ్ క్రాస్ సంస్థలో రక్తదానం చేసిన కన్నె రాజు, రవీందర్ లకు ప్రశంస పత్రం అందించి మరొకరికి ప్రాణదానం చేయడానికి రక్తం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ చందర్ రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.