ఆన్‌లైన్ మోసాలపై ఎస్సై అవగాహన

ఆన్‌లైన్ మోసాలపై ఎస్సై అవగాహన

SKLM: హిరమండలం ఇంఛార్జ్ ఎస్సై కే. వెంకటేష్ గురువారం సంకల్పం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువకులు మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ఆన్‌లైన్ గేమ్స్ ఆడి జీవితాలను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.