VIDEO: ఉగాది వేళ గోవులకు ప్రత్యేక పూజ
SRPT: మునగాల మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని గోవులకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాడిపంటలు సమృద్ధిగా పండాలని, వ్యవసాయానికి వెన్నుముకగా నిలిచే గోమాతను పూజించడం సాక్షాత్తూ కన్నతల్లిని పూజించడమేనని పలు గ్రామస్థులు అన్నారు. రైతులు, మహిళలు, గోవులకు హారతులు ఇచ్చారు.