అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తాం: ట్రంప్‌

అణు పరీక్షలు తిరిగి ప్రారంభిస్తాం: ట్రంప్‌

అణు పరీక్షలను తాము తిరిగి ప్రారంభిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అణ్వాయుధాల విషయంలో US, రష్యా, చైనా ఐదేళ్లలోపు సమాన స్థాయికి చేరుకునే అవకాశముందని చెప్పారు. అందుకే తమ దేశం మళ్లీ అణు పరీక్షలు ప్రారంభించాల్సిన సమయం వచ్చిందన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్‌కు దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేశానని పేర్కొన్నారు.