నేడు కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

నేడు కొప్పోల్ ఉమా సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SRD: నారాయణ ఖేడ్ నియోజకవర్గంలోని పెద్దశంకరంపేట మండలం కొప్పోల్ శ్రీ ఉమా సంగమేశ్వర స్వామి ఆలయంలో జ్యేష్ట మాసము సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో మన్య సూక్త సహిత రుద్రాభిషేక కార్యక్రమాన్ని జరిపించారు. ఆలయంలో మహా పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.