డంప్ యార్డు ప్రక్షాళనకు చర్యలు

KNR: కరీంనగర్ డంప్ యార్డును ప్రక్షాళన చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ చాహాత్ బాజ్‌పాయ్ తెలిపారు. బైపాస్ రోడ్డులోని నగరపాలక సంస్థ చెత్త డంపింగ్ యార్డును అధికారులతో కలిసి సందర్శించారు. డంప్ యార్డు ప్రక్షాళనలో భాగంగా గతంలో ఏర్పాటు చేసిన బయోమైనింగ్ ప్రక్రియ, డీఆర్ సీసీ సెంటర్‌ను తనిఖీ చేశారు.