పొదిలిలో నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పొదిలిలో నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: పొదిలిలో నూతన బార్ ఏర్పాటుకు ఈనెల 26 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్ సీఐ అరుణకుమారి తెలియజేశారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. అప్లికేషన్ దారులు రూ. 5. లక్షల10 వేల రూపాయలు చలానా తీయాల్సి ఉంటుందన్నారు. బార్ డ్రా తీసేందుకు కనీసం నాలుగు అప్లికేషన్లు రావాల్సి ఉంటుందన్నారు. ఆగస్టు 28న ఒంగోలు అంబేద్కర్ భవన్‌లో డ్రా తీయడం జరుగుతుందన్నారు.