'పెన్షన్ పేదలకు ఇచ్చే దానం కాదు.. ప్రభుత్వ బాధ్యత'

అన్నమయ్య: పెన్షన్ అనేది పేదలకు ఇచ్చే దానం కాదు.. ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈరోజు రాజంపేట మండలంలోని బోయిన్‌పల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. 1983లో ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని రూ. 30 ప్రవేశపెట్టారని అన్నారు. ఇప్పుడు వృద్ధులకు 4 వేలు, దివ్యాంగులకు 6 వేలు, 10 వేలు, 15 వేలు ఇస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు.