మండలంలో జనసేన ఇన్సూరెన్స్ చెక్ పంపిణీ కార్యక్రమం

మండలంలో జనసేన ఇన్సూరెన్స్ చెక్ పంపిణీ కార్యక్రమం

AKP: గొలుగొండ మండలం పాతకృష్ణదేవిపేటకు చెందిన జనసేన పార్టీ సభ్యుడు పెదపూడి రాజేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయనకు పార్టీ భీమా పథకం కింద రూ.5 లక్షల ఇన్సూరెన్స్ మంజూరైంది. మంగళగిరిలోని కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి సూర్యచంద్ర పాల్గొన్నారు.