పాక్ నౌకను అడ్డుకున్న ఇరాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ హార్మూజ్ జలసంధి వద్ద పాక్‌కు వెళ్తున్న కంటైనర్ షిప్‌ను ఇరాన్ అడ్డుకుంది. UAEలోని షార్జా నుంచి 'సెలెన్' నౌక కరాచీకి బయలుదేరింది. హర్మూజ్‌ను దాటేందుకు ప్రయత్నిస్తుండగా ఇరాన్ దళాలు అడ్డుకుని ఆ నౌకను తిరిగి వెనక్కి మళ్లించాయి. నిబంధనలు పాటించకపోవడం, రవాణా అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని IRGC తెలిపింది.