ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి: కమిషనర్ సుధీర్ బాబు

మేడ్చల్: రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో మల్కాజిగిరి జోన్‌లోని నేరేడ్‌మెట్ సీపీ కార్యాలయంలో మెగా హెల్త్ క్యాంప్‌ను నిర్వహించారు. రాచకొండ కమిషనర్, ఆర్కేఎస్సీ ఛైర్మన్ జి.సుధీర్ బాబు ఐపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా వైద్యసేవలను అందుకున్నారు. అనంతరం రాచకొండ సీపీ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.