'OU అభివృద్ధి కోసం సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు'
HYD: ఓయూ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారని వీ.హనుమంతరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సర్కారు స్కూల్లో చదివిన, పేదరికంలో నుంచి వచ్చానని కానీ నాకు ఒక విజన్ ఉందని సీఎం తెలిపారన్నారు. OUపై ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కమిట్‌మెంట్‌తో ఆలోచించ లేదన్నారు. మంచి పనులు చేస్తున్న సీఎంను అభినందించాలి కానీ విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.