తెర్లాంలో 'చదవడం మాకు ఇష్టం' కార్యక్రమం

VZM: తెర్లాం స్థానిక శాఖ గ్రంధాలయంలో ఆదివారం 'చదవడం మాకు ఇష్టం' అనే కార్యక్రమాన్ని గ్రంథాలయ అధికారి సీహెచ్ కృష్ణమూర్తి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులచే ఆర్యభట్ట కథలు, చందమామ కథలు, అక్బర్ బీర్బల్ కధలు, నీతి కథలు చదివించారు. గాంధీ జీవిత చరిత్రతో పాటు దేశ నాయకులు చరిత్ర తెలిపే పుస్తకాలు చదివించారు.